satrucharla chandrasekhar raju: టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల

  • వైసీపీకి గుడ్ బై చెప్పిన శత్రుచర్ల చంద్రశేఖరరాజు
  • నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిక
  • జిల్లాలో జగన్ కు మద్దతు పలికిన తొలి నేత శత్రుచర్ల

విజయనగరం జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీకి గుడ్ బై చెప్పి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో పార్వతీపురంలో ఆయన టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా శత్రుచర్లకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు లోకేష్.

వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీలో శత్రుచర్ల కీలక నేతగా ఉన్నారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి శత్రుచర్ల స్వయానా మామ. వైయస్ కు అత్యంత సన్నిహితుడిగా ఈయనకు పేరుంది. మరో విషయం ఏమిటంటే... వైసీపీని జగన్ స్థాపించిన తర్వాత... విజయనగరం జిల్లాలో ఆయనకు మద్దతు ప్రకటించిన తొలి నేత ఈయనే కావడం గమనార్హం. 

satrucharla chandrasekhar raju
YSRCP
Telugudesam
Nara Lokesh
  • Loading...

More Telugu News