JC Divakar Reddy: గవర్నర్ బాగా బతకనేర్చిన మనిషి!: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • నరసింహన్ చాలా కాలం నుంచి తెలుసు 
  • గవర్నర్ కాబట్టి బుద్ధి పుట్టినట్టుగా మాట్లాడలేను
  • నాడు ఇందిరకు, నేడు మోదీకి దగ్గరైన వ్యక్తి

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బతక నేర్చిన మనిషని తెలుగుదేశం నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన కామెంట్స్ చేస్తూ, "నరసింహన్ గారిని నేను చాలా కాలంగా ఎరుగుదును. ఆయన చాలా సాఫ్ట్ గా ఉంటారు. కానీ బతకనేర్చిన వాడు ఆయన. ఒకే ఒక్క సెన్టెన్స్. ఆయన గవర్నర్ కాబట్టి నా బుద్ధి పుట్టినట్టుగా నేను మాట్లాడటం మంచిది కాదు. ఆయన బతకనేర్చిన వాడు. ఎప్పటికేది మాట్లాడాలో అది మాట్లాడతారు. ఆనాడు ఇందిరాగాంధీకి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి నరసింహన్ గారు. ఇవాళ ఆంధ్రదేశంలో నరేంద్ర మోదీకి ఎవరైనా దగ్గరివారంటే ఈయనే" అని అన్నారు.

JC Divakar Reddy
Narasimhan
Indira Gandhi
Narendra Modi
  • Error fetching data: Network response was not ok

More Telugu News