Jammu And Kashmir: కశ్మీర్ నేత గులాం నబీ పటేల్ ను కాల్చి చంపిన టెర్రరిస్టులు

  • రెచ్చిపోయిన ఉగ్రవాదులు
  • యాదిల్ సమీపంలో ఘటన
  • ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికీ గాయాలు

జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈ ప్రాంతంలో రాజకీయ నేతగా పేరున్న గులాం నబీ పటేల్ ను కాల్చి చంపారు. ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ కు చెందిన నలుగురు టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. యాదిల్ పట్టణం నుంచి పుల్వామాకు తన వాహనంలో వస్తుండగా, రాజ్ పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఎటాక్ చేశారు.

విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు అయిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయనతో పాటు ఉన్న ఇద్దరు సెక్యూరిటీ అధికారులకూ తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా, గులాం నబీ మీ పార్టీకి చెందిన వ్యక్తంటే, మీ పార్టీ వ్యక్తని అధికార పీడీపీ, విపక్ష కాంగ్రెస్ చెప్పడం గమనార్హం.

Jammu And Kashmir
PDP
Congress
Gulam Nabi Patel
  • Loading...

More Telugu News