Pooja: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పూజా హెగ్డే చేతిలో మరో చిత్రం 
  • 'ఈ నగరానికి ఏమైంది' అంటున్న తరుణ్ భాస్కర్!
  • భారీ రేటుకి 'కాలా' శాటిలైట్ హక్కులు 
  • వచ్చే నెలలో 'మహానటి' సందడి  

*  'మొహంజొదారో' చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక పూజా హెగ్డే .. కొంత కాలం గ్యాప్ తర్వాత హిందీలో మరో చాన్స్ పొందింది. అక్షయ్ కుమార్, బాబీ డియోల్ హీరోలుగా సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్న 'హౌస్ ఫుల్ 4' చిత్రంలో ఓ నాయికగా పూజాను ఎంపిక చేసుకున్నారు.
*  'పెళ్లిచూపులు' ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన రెండో చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో విశ్వక్, అనీషా జంటగా నటించారు. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తారు.
*  రజనీకాంత్ హీరోగా రంజిత్ పా దర్శకత్వంలో రూపొందిన 'కాలా' చిత్రం శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. ప్రముఖ తమిళ చానెల్ విజయ్ టీవీ ఈ హక్కులను భారీ రేటుకి సొంతం చేసుకుందట.        
*  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'మహానటి' చిత్రం ఆడియో వేడుకను వచ్చే నెల 1న నిర్వహిస్తారు. అదే నెల 9న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇందులో కీర్తి సురేశ్ సావిత్రిగా నటించింది.

  • Loading...

More Telugu News