katasani: ముహూర్తం ఖరారు.. 29న వైసీపీలోకి కాటసాని

  • ఈ నెల 29న వైసీపీలో చేరిక
  • గుడివాడ-పామర్రు మధ్య జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం
  • నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకే బీజేపీకి రాజీనామా

కర్నూలు జిల్లాలో బలమైన నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖరారయింది. ఈ నెల 29వ తేదీన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో నాలుగైదుసార్లు సమావేశమయ్యానని... బీజేపీని వీడి వైసీపీలో చేరాలని అందరూ సూచించారని చెప్పారు.

 వారి అభీష్టం మేరకు తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని, వైసీపీలో చేరుతున్నానని తెలిపారు. మొత్తం 300 వాహనాలలో ఈ నెల 29న జగన్ వద్దకు బయలుదేరుతామని చెప్పారు. గుడివాడ-పామర్రు మధ్య 29న ఉదయం 11 గంటలకు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నానని తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే టికెట్ ను తాను కోరడం లేదని... పార్టీ ఆదేశాల మేరకు పని చేసుకుంటూ వెళతానని చెప్పారు. 

katasani
rambhupal reddy
YSRCP
jagan
BJP
  • Loading...

More Telugu News