Pawan Kalyan: పవన్ కల్యాణ్ మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ఆయన వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది!: టీయూడబ్ల్యూజే నేత క్రాంతికిరణ్
- మీడియాను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని పవన్ చూస్తున్నారు
- పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
- హైదరాబాద్ నుంచి ఆయన్ని పంపించి వేయాలని నా వినతి
సామాజిక మాధ్యమాల్లో పవన్ కల్యాణ్ చేసే పోస్టులకు పొంతన ఉండదని, తాగి ఆ సందేశాలు పెడతారో లేక డ్రగ్స్ తీసుకుని పెడతారో అర్థం కావట్లేదంటూ టీయూడబ్ల్యూజే నేత క్రాంతికిరణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి పోరాటానికి జర్నలిస్ట్ సంఘాల నేతలు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, మీడియాను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని పవన్ చూస్తున్నారని, మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. మీడియా సంస్థలకు పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, హైదరాబాద్ నుంచి ఆయన్ని పంపించి వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు.