anam viveka: ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్న చంద్రబాబు

  • రేపు మధ్యాహ్నం నెల్లూరులో ఆనం అంత్యక్రియలు
  • అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు
  • హాజరుకానున్న సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు

నెల్లూరు జిల్లా సీనియర్ రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. రేపు మధ్యాహ్నం నెల్లూరులో ఆనం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

స్థానిక బొడిగాడి తోటలో నాలుగు గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, టీడీపీ ముఖ్యనేతలు ఈ అంత్యక్రియలకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. రేపు ఉదయం పదకొండు గంటలకు ఆనంకు చంద్రబాబు నివాళులర్పించనున్నారని సమాచారం.

కాగా, కొంత కాలంగా బోన్ కేన్సర్ తో బాధపడిన ఆయన సికింద్రాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఆనం భౌతికకాయాన్ని ఇప్పటికే నెల్లూరుకు తరలించారు. కడసారి ఆయన్ని చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా వస్తున్నారు.

anam viveka
Chandrababu
nellore
  • Loading...

More Telugu News