chiranjeevi: 'సైరా'లో ప్రాణత్యాగం చేసే వీరనారిగా తమన్నా!

  • 'సైరా'లో కథానాయికగా నయనతార 
  • కీలకమైన పాత్రలో తమన్నా 
  • మరో ముఖ్యమైన పాత్రలో ప్రగ్యా జైస్వాల్  

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. చిరంజీవి .. నయనతార కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో తమన్నా కూడా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఈ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేస్తుందని అంతా అనుకున్నారు.

 కానీ ఈ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయడం లేదనీ .. నరసింహా రెడ్డి తరఫున శత్రువులపై పోరాడే వీరనారిగా కనిపించనుందని అంటున్నారు. నరసింహా రెడ్డి కోసం తన ప్రాణాలను త్యాగం చేసే వీరనారి పాత్రను ఆమె పోషించనుందని చెబుతున్నారు. 'బాహుబలి'లో పోరాట సన్నివేశాల్లోను తమన్నా అద్భుతంగా నటించడంతో ఆమెను సురేందర్ రెడ్డి ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక మరో ముఖ్యమైన పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్ పేరు కూడా వినిపిస్తోంది.   

chiranjeevi
nayanatara
  • Loading...

More Telugu News