asharam: ఆశారాం బాపునకు జీవితఖైదు విధించిన జోధ్‌పూర్ కోర్టు!

  • బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆశారాం బాపు
  • దెయ్యం వదిలిస్తానని మభ్యపెట్టి అఘాయిత్యం
  • ఇప్పటికే ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఆధ్యాత్మిక గురువు

ఆధ్యాత్మిక గురువు ముసుగులో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆశారాం బాపు 2013 నుంచి జైలులో ఉంటోన్న విషయం తెలిసిందే. ఈ రోజు జోధ్‌పూర్‌ ట్రయిల్‌ కోర్టు తుది తీర్పు వెల్లడిస్తూ.. ఆయనకు జీవిత ఖైదు విధించింది. చనిపోయేవరకు ఆయన జైలుశిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అలాగే, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరికి 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

2013 ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయికి దెయ్యం పట్టిందని, దాన్ని వదిలిస్తానని చెప్పిన ఆశారాం బాపు ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ విషయంపై ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. పోలీసులకు చిక్కకుండా దాక్కుంటోన్న ఆయనను ఎట్టకేలకు 2013 సెప్టెంబర్‌ 1న పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులో ఉంటున్నారు.  

  • Loading...

More Telugu News