Chandrababu: మరో ఏడాదిలో అమరావతికి 38 వేల కుటుంబాలు.. 10 ఎకరాల్లో మాల్: చంద్రబాబు

  • అమరావతిలో రానురాను జనాభా పెరుగుతుంది
  • రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ ను ఏర్పాటు చేయండి
  • కంటెయినర్ హోటళ్లను ఏర్పాటు చేయనున్న షెరటాన్, ఫార్చ్యూన్

ఒక సంవత్సర కాలంలో ఏపీ రాజధాని అమరావతికి 38 వేల కుటుంబాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రానురాను జనాభా పెరుగుతుందని తెలిపారు. సీఆర్డీయే పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఎకరాల్లో మాల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాజధానిలో రెస్టారెంట్లు, థియేటర్లు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ మాల్స్ తదితర సదుపాయాలను కల్పించాలని చెప్పారు. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో మాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు రాజధానిలోని ప్రధాన రహదారుల వెంట కంటెయినర్ హోటళ్ల ఏర్పాటుకు షెరటాన్, ఫార్చ్యూన్ సంస్థలు ముందుకొచ్చాయి. 

  • Loading...

More Telugu News