somu veerraju: చంద్రబాబు అలిపిరి ఘటనను నేను ప్రస్తావించడానికి కారణం ఇదే!: సోము వీర్రాజు

  • సానుభూతి పని చేయదని చెప్పేందుకు అలా మాట్లాడా
  • నాలుగేళ్లలో చంద్రబాబు మిత్రధర్మాన్ని పాటించలేదు
  • చంద్రబాబుకు భయపడాల్సిన అవసరం లేదు

గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మిత్రధర్మం పాటించలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. 2019 ఎన్నికల్లో సానుభూతి పనిచేయబోదని చెప్పే ఉద్దేశంతోనే... చంద్రబాబుకు సంబంధించి అలిపిరి పేలుడు ఘటనను తాను ప్రస్తావించానని వివరణ ఇచ్చారు. ఆ అంశాన్ని ప్రస్తావించడం వెనుక మరే ఇతర కారణాలు లేవని చెప్పారు.

గత నాలుగేళ్లుగా గవర్నర్ నరసింహన్ ను చంద్రబాబు ఒక్కమాట కూడా అనలేదని... ఇప్పుడు గవర్నర్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించడం వెనుక ఉన్న కారణాలు ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణపై కేసులు పెట్టని టీడీపీ ప్రభుత్వం... బీజేపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రం తప్పుడు కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏదో జరగబోతోందనే ప్రచారం చేస్తున్నారని... చంద్రబాబును చూసి తాము అంతగా భయపడాల్సిన అవసరం లేదని వీర్రాజు అన్నారు. 

somu veerraju
Chandrababu
Narendra Modi
Balakrishna
narasimhan
  • Loading...

More Telugu News