ntr: పుకార్లకు చెక్ పెట్టిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

  • 'ఎమ్మెల్యే' ఆడియో ఫంక్షన్ కు హాజరుకాని తారక్
  • దీంతో, అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయంటూ ప్రచారం
  • తాజాగా కల్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన తారక్

కల్యాణ్ రామ్ నటించిన 'ఎమ్మెల్యే' సినిమా విడుదలకు ముందు జరిగిన ఆడియో ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతాడని అందరూ భావించారు. అయితే, కొత్త సినిమా మేకోవర్ బయటపడకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఆ ఫంక్షన్ కు హాజరవలేదు. అయితే, 'భరత్ అనే నేను' సినిమా బహిరంగ సభకు మాత్రం హాజరయ్యాడు.

దీంతో, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ల మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నిటికీ అన్నదమ్ములు చెక్ పెట్టారు. కల్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ హాజరయ్యాడు. దీంతో,  పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఈ ఫంక్షన్ కు నందమూరి హరికృష్ణ కూడా వచ్చారు. 

ntr
kalyan ram
tollywood
  • Loading...

More Telugu News