అక్షయ్ కుమార్ సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం
- 'కేసరి' షూటింగ్ లో అగ్నిప్రమాదం
- బాంబు పేలుడు సన్నివేశాల సమయంలో ఎగసిన మంటలు
- మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
అయితే, ప్రమాదం జరిగిన సమయంలో అక్షయ్ కుమార్ షూటింగ్ స్పాట్ లో లేడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి, మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసు అధికారులు తెలిపారు. 21 సిక్ రెజిమెంట్ కు చెందిన కమాండర్ హవల్దార్ ఇశ్రా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 1897 సెప్టెంబర్ లో జరిగిన సారాగర్హి యుద్ధంలో ఆఫ్ఘాన్ ఆక్రమణదారులతో ఇశ్రా సింగ్ ధైర్యంగా పోరాడాడు. ఆ అమరవీరుడి చరిత్రను ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారు.