Madhya Pradesh: మోడల్ స్కర్ట్ లాగి కిందపడేసి, వేధించిన ఇద్దరి అరెస్ట్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-7fc1b6556a0a608ef460bc08afbed680cfee121c.jpg)
- ఇండోర్ లో ఘటన
- సోషల్ మీడియాలో ఫిర్యాదు
- స్పందించిన శివరాజ్ సింగ్
- 24 గంటల్లోనే నిందితుల అరెస్ట్
తన ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ మోడల్ ను నడిరోడ్డుపై వేధించిన పోకిరీలను ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై స్వయంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించడంతో, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి నిందితులను గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇండోర్ లో ఆదివారం నాడు బాధిత యువతి యాక్టివా స్కూటర్ పై వెళుతుండగా, ఓ రెడీమేడ్ స్టోర్ లో పని చేస్తున్న ఇద్దరు యువకులు మంగల్ సిటీ మాల్ పరిసరాల్లో ఆమెను వెంబడించారు.
స్కర్టు వెనకాల ఏముందో చూపించాలని అంటూ లాగి కిందపడేశారు. ఈ ఘటనలో ఆమెకు గాయాలు అయ్యాయి.
![](https://img.ap7am.com/froala-uploads/froala-df5a2e706c0001262717d2b875e74e8f92ee8466.jpg)