pruthvi: వాళ్లిద్దరి నుంచి నటనతో పాటు ఓర్పు, సహనం నేర్చుకున్నాను!: కమెడియన్ పృథ్వీ
- నేను ఆర్టిస్ట్ ను కావాలని మా అమ్మకి ఉండేది
- ప్రభాకర్ రెడ్డి గారు ప్రోత్సహించారు
- రావు గోపాలరావు నుంచి నేర్చుకున్నాను
తెలుగు తెరపై సందడి చేసే హాస్యనటుల్లో పృథ్వీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను హీరోను కావాలని మా అమ్మకి ఉండేది. అది జరిగేపని కాదని నేను అంటూ ఉండేవాడిని. నేను ఆర్టిస్ట్ ను కావాలని మా అమ్మ అనుకున్నది నిజమవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు"
"మా గురువుగారు సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డిగారు. 'నువ్ బాగుంటావురా .. సినిమాల్లో ట్రై చెయ్' అని ఆయన అనేవారు. ఆయన ద్వారానే రావు గోపాలరావు గారు పరిచయమయ్యారు. వాళ్లిద్దరి దగ్గర నుంచి నటనతో పాటు ఓర్పు .. సహనం నేర్చుకున్నాను. ఎదుగుతున్నా ఎలా ఒదిగి ఉండాలనేది తెలుసుకున్నాను .. వాళ్లిద్దరూ నాకు ఆదర్శం" అని చెప్పుకొచ్చారు.