anam vivekananda reddy: ఆనం మృతి పట్ల సంతాపం తెలిపిన చంద్రబాబు, హరికృష్ణ

  • ఆనం మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు
  • సంతాపం వ్యక్తం చేసిన కోడెల, నారా లోకేష్
  • ఈ ఉదయం కన్నుమూసిన ఆనం

తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆనం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఒక మంచి ప్రజానేతను కోల్పోయామని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. ఆనం మరణం నెల్లూరు జిల్లా ప్రజలకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారం కోసం పని చేసేవారని చెప్పారు.

 ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు నారా లోకేష్, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలతో పాటు నందమూరి హరికృష్ణ ఆనం మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆనం ఈ ఉదయం హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.


anam vivekananda reddy
Chandrababu
Nara Lokesh
kodela
harikrishna
narayana
somireddy
  • Loading...

More Telugu News