kalyanram: కల్యాణ్ రామ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-3137ab16a65d1c4e025601664f580a362a5b22a4.jpg)
- పూజా కార్యక్రమాలకి జూనియర్ ఎన్టీఆర్, నందమూరి రామకృష్ణ, నందమూరి హరికృష్ణ
- కల్యాణ్ రామ్ సరసన హీరోయిన్ లుగా షాలినీ పాండే, నివేదా థామస్
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
కేవీ గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా కొత్త చిత్రం ఈరోజు ప్రారంభం అయింది. ఇది ఆయన 16వ చిత్రం. దీనికి శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకి జూనియర్ ఎన్టీఆర్, నందమూరి రామకృష్ణ, నందమూరి హరికృష్ణ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన షాలినీ పాండే, నివేదా థామస్‌లు హీరోయిన్ లుగా నటించనున్నారు. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-d99d50d65aedbede4708b849f045ef2d65341256.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-1d3984ca73e21715d1794b811c8c83bdb44cfdca.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-dfae601ca204a6f682fef047b12f46e860e86806.jpg)