anam vivekananda reddy: సీనియర్ రాజకీయవేత్త ఆనం వివేకానందరెడ్డి ఇకలేరు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-582e7ab617d586a388638c2c403a3f20a65f95c9.jpg)
- గత కొంత కాలంగా బోన్ కేన్సర్ తో బాధపడుతున్న ఆనం
- కిమ్స్ ఆసుపత్రిలో ఈ ఉదయం కన్నుమూత
- దిగ్భ్రాంతికి గురవుతున్న టీడీపీ, కాంగ్రెస్ నేతలు
నెల్లూరు జిల్లా సీనియర్ రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. సికింద్రాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన బోన్ కేన్సర్ తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, కుటుంబసభ్యులు ఆయనను కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు.
కొన్ని వారాలుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత ఎన్నికల తర్వాత తన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో కలసి ఆయన టీడీపీలో చేరారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి, ఆనంను పరామర్శించారు. మరోవైపు వివేక మృతితో టీడీపీ, కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-a2cb0ded2518a5ff53b4fd8be5734c2ded6e8361.jpg)