Tenali: తెనాలిలో దారుణం... రైలు ఆగడం లేదని తెలుసుకుని దూకేసిన యువతి!

  • నెల్లూరు నుంచి తెనాలి బయలుదేరిన సమిత
  • రైలుకు స్టాప్ లేకపోవడంతో దూకేసిన యువతి
  • తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలు

తాను దిగాల్సిన స్టేషన్ లో రైలు ఆగదని తెలుసుకున్న ఓ యువతి ఆ కంగారులో నడుస్తున్న రైలు నుంచి కిందకు దూకి ప్రాణాలపైకి తెచ్చుకుంది. ఈ ఘటన తెనాలి రైల్వే స్టేషన్ లో జరిగింది. సమిత అనే యువతి నెల్లూరు నుంచి తెనాలికి బయలుదేరి, రప్తీసాగర్ ఎక్స్ ప్రెస్ (గోరఖ్ పూర్ - త్రివేండ్రం) రైలును ఎక్కింది. ఆపై తెనాలిలో రైలు ఆగదని తెలుసుకుని, వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య పోరాడుతోంది.

Tenali
Raptisagar
Nellore
Train
Accident
  • Loading...

More Telugu News