Tollywood: అసలిక సినిమాలే వద్దనుకున్నా: సమంత

  • ఇటీవలే 'రంగస్థలం'తో హిట్ అందుకున్న సమంత
  • నటనను కూడా ఉద్యోగంలా భావిస్తున్నా
  • మంచి కథలు వస్తుండటంతో సినిమాలు చేస్తున్నానన్న సమంత

అక్కినేని వారింటి కోడలిగా మారిన తరువాత కూడా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, ఇటీవలే 'రంగస్థలం'తో హిట్ అందుకుని త్వరలోనే 'మహానటి'లో పలకరించనున్న బ్యూటీ సమంత, నటనను కూడా ఓ ఉద్యోగమే అనుకోవడం ప్రారంభించిన దగ్గర నుంచి తన జీవితమే మారిపోయిందని వ్యాఖ్యానించింది. మారిన తన ఆలోచన తనకెంతో మేలు చేసిందని పేర్కొంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత, వ్యక్తిగత జీవితంతో పాటు నటననూ ఆస్వాదిస్తున్నానని చెప్పింది. ఒక దశలో సినిమాలు మానేద్దామని అనుకున్నానని, అయితే, మంచి కథలు వస్తుండటంతో అలా చేయాల్సిన అవసరం కలగలేదని చెప్పింది. కొత్త పాత్రలు తనకు దగ్గరవుతుండటంతో ఉత్సాహంగా ఉన్నానని, ఒకప్పుడు హిట్ సినిమాల్లో నటించినా, వాటిని ఆస్వాదించలేని పరిస్థితి నుంచి ఇప్పుడు బయటపడ్డానని వెల్లడించింది. తన సినిమాలకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ తనకెంతో ధైర్యాన్నిస్తోందని చెప్పుకొచ్చింది.

Tollywood
Samantha
Talking Movies
Rangasthalam
Mahanati
  • Loading...

More Telugu News