Vijayanagaram District: విజయనగరంలో అంగన్ వాడీ వర్కర్లపై లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నా: వైఎస్ జగన్

  • ‘మహిళా సాధికారత’ అని కబుర్లు చెబుతారు!
  • మరోవైపు వారిపై దాడులు చేస్తారు!
  • తెలంగాణలో అంగన్ వాడీ వర్కర్లకు జీతాలు పెంచారు
  • మరి, ఏపీలో ఎందుకు పెంచరు?

విజయనగరంలో అంగన్ వాడీ వర్కర్లపై జరిగిన లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నట్టు వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘మహిళా సాధికారిత’ అని కబుర్లు చెబుతూ, మరోవైపు వారిపై దాడులు చేయడం సబబు కాదని అన్నారు. తెలంగాణాలో అంగన్ వాడీ వర్కర్లకు జీతాలు పెంచిన విషయాన్ని ప్రస్తావించిన జగన్, మరి, ఏపీలో ఎందుకు పెంచరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కాగా, విజయనగరంలోని ఐసీడీఎస్ కార్యాలయాన్ని అంగన్ వాడీ కార్యకర్తలు నిన్న ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిసిన వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.

Vijayanagaram District
YSRCP
ys jagan
  • Loading...

More Telugu News