Chandrababu: గవర్నర్ నరసింహన్ తీరుపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

  • టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను కలుపుతున్నారనే ఆరోపణలు  
  • గవర్నర్ ఇలా వ్యవహరించడం మంచిది కాదు
  • గవర్నర్ వ్యవస్థ వద్దని టీడీపీ గతంలోనే చెప్పింది

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయని ఆయన అన్నారు. గవర్నర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆ విధంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు.

అసలు గవర్నర్ వ్యవస్థే వద్దని టీడీపీ గతంలోనే చెప్పిందని... ఆ అంశంపై పోరాటం కూడా చేశామని చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం పని చేసుకోవాల్సిన వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ అని... వార్తాపత్రికల్లో న్యూస్ వచ్చేలా గవర్నర్ వ్యవహరించడం మంచి పద్ధతి కాదని అన్నారు. నిన్ననే విజయవాడలో నరసింహన్, చంద్రబాబులు కలసిన సంగతి తెలిసిందే.

Chandrababu
narasimhan
comments
  • Loading...

More Telugu News