kanna lakshminarayana: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా

  • అమిత్ షాకు రాజీనామా లేఖను ఫ్యాక్స్ చేసిన కన్నా
  • రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించిన కన్నా

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రామ్ మాధవ్, సతీష్ జీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు. రేపు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్ష పదవిపై కన్నా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒకానొక సమయంలో అధ్యక్షుడి రేసులో ఆయన పేరు కూడా వినిపించింది. అయితే, ఆ తర్వాత ఆయనను దూరంగా ఉంచారు. ఈ నేపథ్యంలో నిరాశకు గురైన కన్నా... చివరకు బీజేకి గుడ్ బై చెప్పారు.  

kanna lakshminarayana
BJP
resignation
YSRCP
jagan
  • Loading...

More Telugu News