Mahesh Babu: మహేశ్ మూవీకి కొత్త సీన్స్ జతచేస్తారట!

  • హిట్ టాక్ తెచ్చుకున్న 'భరత్ అనే నేను'
  • అనూహ్యమైన ఆదరణ పట్ల కొరటాల ఆనందం 
  • అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించే అంశం

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ హీరోగా 'భరత్ అనే నేను' సినిమా తెరకెక్కింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతూ ఉండటంతో, ఫైనల్ ఎడిటింగ్ సమయంలో తాను తొలగించిన సన్నివేశాలను తిరిగి కలపనున్నట్టు కొరటాల శివ చెప్పారు.

 ఫైనల్ ఎడిటింగ్ సమయంలో నిడివి కారణంగా కొన్ని మంచి సీన్స్ ను తొలగించవలసి వచ్చిందని, ఆ సన్నివేశాలను త్వరలో కలపనున్నామని ఆయన అన్నారు. త్వరలో కలపనున్న ఆ సీన్స్ కు డబ్బింగ్ చెప్పించడం మొదలైనట్టు సమాచారం. అయితే, ఎప్పటి నుంచి ఈ సీన్స్ ను యాడ్ చేయబోతున్నారనేది తెలియాల్సి వుంది. కొత్త సీన్స్ ను జోడించడం వలన అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.         

  • Loading...

More Telugu News