cpi rama krishna: ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ‘భరత్ అనే నేను’ సినిమాను చూడాలి!: సీపీఐ రామకృష్ణ

  • ముఖ్యమంత్రులిద్దరూ రాచరిక పాలన చేస్తున్నారు
  • ఈ సినిమా చూస్తే ప్రజా సమస్యలెలా పరిష్కరించాలో తెలుస్తుంది
  • ‘గాలి’ సోదరుడుకి పదవులిచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది!

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో తన నటనా కౌశలం ప్రదర్శించాడు. ఇదిలా ఉండగా, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు చూడాలని సీపీఐ నేత రామకృష్ణ సూచించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సినిమా చూస్తే ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలుస్తుందని అన్నారు. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ రాచరిక పాలన చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులకు టికెట్లిస్తూ కమ్యూనిస్టులపై ఆరోపణలు చేయడం సబబు కాదన్న ఆయన, గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డికి కర్ణాటక బీజేపీ పదవులు ఇవ్వడానికి సిద్ధమవుతోందని, స్థానిక సంస్థలను, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రామకృష్ణ దుయ్యబట్టారు.

cpi rama krishna
Bharath Ane Nenu
kcr
Chandrababu
  • Loading...

More Telugu News