sai kumar: కదిరి లక్ష్మీనరసింహుడిని దర్శించుకుని.. నామినేషన్ వేసిన నటుడు సాయి కుమార్

  • బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి సాయికుమార్
  • చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లిలో నామినేషన్ వేసిన నటుడు
  • బీఫామ్ విషయంలో చివరి నిమిషం వరకు ఉత్కంఠ

కర్ణాటక ఎన్నికల బరిలోకి సినీ నటుడు సాయికుమార్ దిగారు. చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఆయన కదిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం బాగేపల్లికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

మరోవైపు దీనికి ముందు సాయికుమార్ కు బీఫామ్ దక్కుతుందా? లేదా? అనే విషయం ఆయన అనుచరుల్లో టెన్షన్ రేకెత్తించింది. దీంతో, బెంగళూరులోని యెడ్యూరప్ప ఇంటివద్ద ఉన్న బ్యారికేడ్లను తోసుకుని, ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు సాయికుమార్ అనుచరులు యత్నించారు. ఈ సందర్భంగా వీరితో యెడ్యూరప్ప చర్చలు జరిపారు. సాయికుమార్ కు టికెట్ కేటాయిస్తున్నామని, కొన్ని కారణాల వల్లే ఆయన పేరును ప్రకటించలేకపోతున్నామని యెడ్డీ తెలిపారు. దీంతో, సాయికుమార్ అనుచరులు శాంతించారు. ఎట్టకేలకు ఆయన ఈరోజు నామినేషన్ వేశారు.

sai kumar
BJP
nomination
bagepalli
Tollywood
  • Loading...

More Telugu News