renuka chowdary: క్యాస్టింగ్ కౌచ్ అనేది అన్ని చోట్లా ఉంది..పార్లమెంటు కూడా అతీతం కాదు!: రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
- క్యాస్టింగ్ కౌచ్ సినీ పరిశ్రమకే పరిమితంకాదు
- అన్ని చోట్లా ఉంది
- ఈ వ్యవహారంపై అందరూ కలసి పోరాడాలి
క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే లేదని.... అన్ని చోట్లా ఉందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ రేణుక ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో పార్టమెంట్ అతీతమని భావించవద్దని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.
సినీ పరిశ్రమలో ఎవరినీ రేప్ చేసి వదిలేయడం లేదని... వాడుకుని వదిలేయడం లేదని... క్యాస్టింగ్ కౌచ్ వల్ల కొందరికి జీవనోపాధి లభిస్తోందని సరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని రేపాయి. ఆ తర్వాత సరోజ్ ఖాన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. శ్రీరెడ్డి కూడా సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు.