ntr: ఎన్టీఆర్ పాటల రికార్డింగ్ పూర్తిచేస్తోన్న తమన్

  • ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ మూవీ 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • సంగీత దర్శకుడిగా తమన్  

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తదితరులపై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక మరో వైపున ఈ సినిమాకి తమన్ స్వరాలను అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పాటలను ఆయన ముంబైలోని ఒక ప్రైవేట్ స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్నారు.

 ఈ మధ్య కాలంలో తమన్ 'తొలిప్రేమ' .. 'ఛల్ మోహన్ రంగ' కోసం స్వరపరిచిన పాటలు యూత్ లోకి బాగా దూసుకుపోయాయి. ఇక ఎన్టీఆర్ కి యూత్ లోను .. మాస్ లోను గల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తమన్ ఈ సినిమాకి స్వరాలను అందిస్తున్నాడట. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయనున్నారు.   

  • Loading...

More Telugu News