Vizag: వైజాగ్ లో వర్షం.. సేదదీరిన పట్టణ వాసులు!

  • గత రెండు రోజులుగా ఏవోబీ సరిహద్దుల్లో కురుస్తున్న వానలు
  • వైజాగ్ లోని వివిధ ప్రాంతాల్లో వర్షం
  • ఉక్కపోతతో తల్లడిల్లిన పట్టణ వాసులకు ఊరట

ఎండవేడిమితో ఇబ్బంది పడుతున్న వైజాగ్ వాసులను వరుణుడు కరుణించాడు. గత రెండు రోజులుగా ఉత్తరాంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వర్షం పడగా, నేడు వైజాగ్ ను కూడా వర్షం పలకరించింది. అకస్మాత్తుగా వైజాగ్ ను మేఘాలు కమ్ముకోవడంతో, వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఎండవేడిమికి తల్లడిల్లిన వైజాగ్ వాసులను చల్లనిగాలులు సేదదీర్చాయి. పెందుర్తి, కొత్తవలస, గోపాలపట్నం, సింహాచలం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా, ఎన్ఏడీ జంక్షన్, రైల్వేస్టేషన్, జగదాంబ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. 

Vizag
Visakhapatnam District
raining
  • Loading...

More Telugu News