p20 pro: మూడు కెమెరాలున్న హువావే పి20 ప్రో, పి20 లైట్ స్మార్ట్ ఫోన్ల విడుదల

  • పి20 ప్రో ధర రూ.64,999
  • పి20 లైట్ ధర రూ.19,999
  • వచ్చే నెల 3 నుంచి అమ్మకాలు

ఎంతో ఆసక్తి నెలకొన్న హువావే పి20 ప్రో, పి20 లైట్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ ఈ రోజు దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో పి20 ప్రో మూడు కెమెరాలతో ఉండడం విశేషం. పి20 ప్రో మోడల్ లో 40+20+8 మెగా పిక్సల్ కెమెరాలు ఉంటాయి. జర్మనీకి చెందిన లీకా అనే కంపెనీతో కలసి కెమెరాలను అభివృద్ధి చేసింది. ముందు భాగంలో 24 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేశారు.

పి20 లైట్ మోడల్ లో రెండు కెమెరాలు (16+2 మెగాపిక్సల్ ) వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ తో ఉంటుంది. పి20 ప్రో ధర రూ.64,999 కాగా, పి20 లైట్ ధర రూ.19,999. వచ్చే నెల 3 నుంచి అమేజాన్ ఇండియాలో మాత్రమే వీటి విక్రయాలు జరుగుతాయి.

  • Loading...

More Telugu News