Mahesh Babu: విజయవాడ థియేటర్లో 'భరత్' మూవీ చూడనున్న మహేశ్ బాబు!

  • భారీ హిట్ కొట్టేసిన 'భరత్ అనే నేను'
  • తిరుపతిలో విజయోత్సవ వేడుక 
  • విజయవాడ వెళ్లే ఆలోచనలో మహేశ్  

'భరత్ అనే నేను' భారీ విజయాన్ని అందుకోవడంతో, మహేశ్ బాబుతో పాటు ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఈ సినిమా టీమ్ .. ఈ నెల 27వ తేదీన తిరుపతిలో విజయోత్సవ సభను నిర్వహించాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

 తన సినిమా భారీ హిట్ కొట్టినప్పుడు .. విజయవాడ వెళ్లి అక్కడ ఓ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం మహేశ్ బాబుకు అలవాటు. ఈ సారి కూడా ఆయన ఆ థియేటర్ కి వెళ్లి ప్రేక్షకుల నడుమ 'భరత్ అనే నేను' చూడటానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. అయితే అందరికీ తెలిసేలా ఆయన అక్కడికి వెళ్లి వస్తాడా .. లేదంటే సైలెంట్ గా వెళ్లి థియేటర్లోని సందడిని ప్రత్యక్షంగా చూసి పొంగిపోతూ వస్తాడో చూడాలి.      

Mahesh Babu
kiara advani
  • Loading...

More Telugu News