Canada: కళ్ల ముందు హంతకుడున్నా సంయమనంతో వ్యవహరించిన కాప్... సోషల్ మీడియా నయా హీరో!

  • ఎదురుగా 10 మందిని చంపిన హంతకుడు
  • తన వద్ద ఆయుధముందని హెచ్చరిక
  • అయినా ధైర్యంగా వ్యవహరించిన కెనడా పోలీసు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన వైనం

అత్యంత దారుణంగా వ్యవహరించి 10 మంది ప్రాణాలు తీసిన హంతకుడు ఎదురుగా ఉంటే, అతన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయకుండా, సంయమనంతో వ్యవహరించి, అతన్ని ప్రాణాలతో పట్టుకున్న టొరంటో కాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. అతని పేరును వెల్లడించి, ఎవరో చెప్పేందుకు పోలీసు ఉన్నతాధికారులు నిరాకరించగా, ప్రపంచ సోషల్ మీడియా ఇప్పుడా కాప్ ను ఆకాశానికేెత్తేస్తోంది. అమెరికన్ పోలీసులైతే నిందితుడిని చూసీ చూడగానే కాల్చేసి ఉండేవారని, కెనడా వ్యక్తి కాబట్టే, నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా, టొరంటో, ఒంటారియాలో జరిగిన ఓ ఘటనలో నిందితుడు వ్యాన్ ను వేగంగా నడిపిస్తూ తెచ్చి, పాదచారులపైకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆపై నిందితుడిని అదుపు చేస్తున్న పోలీసుల వీడియో బహిర్గతమైంది. కెనడా చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా ఈ దురాగతాన్ని వ్యవహరిస్తున్నారు. ఇక నిందితుడి ముందు పోలీస్ ఉన్న వేళ, తనను చంపాలని అతను కోరినా, తాను ఆపని చేయబోనని, లొంగిపోవాలని సదరు పోలీసు కోరాడు.

ఆపై తన జేబులో తుపాకీ ఉందని హెచ్చరించగా, తను లెక్క చేయబోనని, నేలపై కూర్చోవాలని చెబుతున్నట్టు ఈ వీడియోలో వినిపిస్తోంది. ఆ తరువాత తన వద్ద ఉన్న అనుమానిత వస్తువులను నిందితుడు విసిరేస్తుండగా, వాటికి ఎదురునిలిచి, తన ధైర్యాన్ని చూపాడా పోలీసు. "ఆ సమయంలో అతను సూసైడ్ కాప్ లా కనిపించాడు. అతను రియల్లీ గ్రేట్" అని పదవీ విరమణ చేసిన రాయల్ కెనడియన్ పోలీస్ ఉన్నతాధికారి గారీ క్లెమెంట్ వ్యాఖ్యానించారు. అతన్ని స్వయంగా కలిసి అభినందిస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News