Shabbir Ali: హిందూ గురువులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన షబ్బీర్ అలీ

  • హైదరాబాదులోని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన షబ్బీర్
  • ఆశీర్వదించిన గురువులు
  • శాలువా కప్పి, మెమెంటో అందజేత

హిందూ దేవాలయంలో తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ పూజలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాదులోని ఓ దేవాలయంలో హిందూ మత గురువులతో కలసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయనను గురువులు ఆశీర్వదించారు. ఆయనకు శాలువా కప్పి, స్వామి వారి మెమెంటోను అందజేశారు. మరోవైపు, షబ్బీర్ అలీ దేవాలయానికి రావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది సర్వమత సౌభ్రాతృత్వానికి చిహ్నమని అంటున్నారు.  

Shabbir Ali
hindu
temple
  • Loading...

More Telugu News