IPL: ఇలాగైతే చాలా కష్టం: గౌతమ్ గంభీర్

  • స్వల్ప స్కోరును ఛేదించలేక చతికిలబడ్డ ఢిల్లీ డేర్ డెవిల్స్
  • అసంతృప్తిని వ్యక్తం చేసిన కెప్టెన్ గౌతమ్ గంభీర్
  • త్వరగా వికెట్లు కోల్పోవడమే కారణమని వెల్లడి

గత రాత్రి సొంత మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేసిన స్వల్ప స్కోరును చేరుకోలేక చతికిలపడ్డ తన జట్టు సభ్యులపై ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 144 పరుగుల టార్గెట్ ను కూడా తాము ఛేదించలేదని గుర్తు చేసిన ఆయన, ఇలాగైతే పాయింట్ల పట్టికలో ముందుకెళ్లడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన గంభీర్, తాము త్వరగా వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్థికి పట్టు చిక్కిందని చెప్పాడు. మిడిల్ గేమ్ లో పరుగులు చేసినా, క్రమంగా వికెట్లు పడిపోవడంతో గెలుపు అవకాశాలు దగ్గర కాలేదని చెప్పాడు. అయితే, శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా బ్యాటింగ్ లో రాణించడం భవిష్యత్తుకు శుభ పరిణామమని చెప్పాడు. కేవలం 10 బంతుల్లో 22 పరుగులు చేసిన పృథ్వీని అభినందించిన గంభీర్, ఇక తదుపరి మ్యాచ్ లపై దృష్టిని పెట్టనున్నట్టు వెల్లడించాడు.

IPL
Gautam Gambhir
Delhi Daredevils
Kings XI Punjab
  • Loading...

More Telugu News