Tollywood: పవన్ కల్యాణ్ కు మద్దతుగా మాట్లాడిన అల్లు అరవింద్... ఆ పని చేయలేమని స్పష్టం చేసిన సినీ పెద్దలు!

  • నటీనటులే టార్గెట్ గా చర్చలు
  • వాటిని నిషేధిద్దామని అల్లు అరవింద్ ప్రతిపాదన
  • సుముఖత వ్యక్తం చేయని పెద్దలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని కొందరు నటీ నటులను, సాంకేతిక నిపుణులను టార్గెట్ గా చేసుకుని చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కొన్ని చానళ్లను నిషేధించాలని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఫిలిం చాంబర్ పెద్దల ముందు నిర్మాత అల్లు అరవింద్ ఉంచుతూ, వాటిని బహిష్కరిద్దామని చేసిన ప్రతిపాదనకు మద్దతు సంపాదించడంలో విఫలమయ్యారట.

దీంతో టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. చాంబర్ కు వచ్చిన అల్లు అరవింద్, సినీ పెద్దలతో సమావేశమై, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మద్దతివ్వాలని, సదరు చానళ్లను దూరం పెడదామని చెప్పిన వేళ, వారు సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. సెలబ్రిటీలపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చిన వేళ నిశ్శబ్దంగా ఉన్న మెగా ఫ్యామిలీ, విషయం తమదాకా వచ్చిన తరువాతనే బయటకు వచ్చిందని అల్లు అరవింద్ ముందే కొందరు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. టీవీ చానళ్లను బహిష్కరించాలని కోరడం సరికాదని, ఆ పని చేయలేమని అసోసియేషన్ పెద్దలు స్పష్టంగా చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలంటున్నాయి.

Tollywood
Casting Couch
Allu Araving
Pawan Kalyan
  • Loading...

More Telugu News