Pawan Kalyan: ఈసారి రవి ప్రకాశ్ వంతు.. వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్న పవన్!

  • నువ్వు దేవుడిని, పూజలను కూడా నమ్ముతావా? అంటూ రవిప్రకాశ్‌కు ప్రశ్న
  • నోరు మూసుకుని కూర్చున్నందుకే తనపై లేనిపోనివి రాస్తున్నారన్న పవన్
  • తాను పంపిన క్లిప్పింగులతో షో చేయాలని సూచన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ట్వీట్ల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు. గత  రాత్రి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఫొటో పోస్టు చేసి భోజనంలో కాస్తంత సంస్కారాన్ని కూడా వడ్డించమని కుమారుడికి సలహా ఇచ్చి గుడ్ నైట్ చెప్పిన పవన్ మళ్లీ ఉదయాన్నే వరుస ట్వీట్లతో ముందుకొచ్చారు.

టీవీ 9 సీఈవో రవి ప్రకాశ్‌కు గుడ్ మార్నింగ్ చెబుతూ రవిప్రకాశ్ దంపతులు పూజలో ఉన్న ఫొటోను పోస్టు చేశారు. ‘నువ్వు దేవుడిని, పూజలను కూడా నమ్ముతావా’ అని క్యాప్షన్ తగిలించారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ ‘‘నీకు కొన్ని ఆర్టికల్స్ పంపిస్తున్నాను. వీటితో కూడా ఏమైనా షో చేయగలవా?’’ అని ప్రశ్నించారు. అనంతరం మరో ట్వీట్‌లో రవి ప్రకాశ్‌కు బహిరంగ లేఖ పేరుతో కొన్ని ఆర్టికల్ క్లిప్పింగులు విడుదల చేశారు. ఈ క్లిప్పింగుల ఆధారంగా రాత్రి 9 గంటల షో చేసి సమన్యాయం చేయాలని సూచించారు. తాము నోరు మూసుకుని ఉంటున్నందుకే తమపై విషం కక్కుతున్నారని ఆరోపించారు.

అలాగే టీవీ 9 అధినేత శ్రీనిరాజుపైనా పవన్ విరుచుకుపడ్డారు. ‘‘ఐఎస్‌బీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు బోర్డు మెంబరుగా ఉన్న నీవు.. నీ చానెల్‌లో మాత్రం అభ్యంతరకరమైన వార్తలు ప్రసారం చేస్తావా? కాస్త, గౌరవప్రదంగా నడుచుకోవడం నేర్చుకో’’ అని సూచించారు.

Pawan Kalyan
TV9
Ravi prakash
srini raju
  • Loading...

More Telugu News