Tamilnadu: ఆడపిల్లలను పాడు చేయాలని చూసే ఈ నిర్మలాదేవి నాకొద్దు... విడాకులకు దరఖాస్తు చేసిన భర్త!

  • వర్శిటీ పెద్దల లైంగిక అవసరాలు తీర్చండి
  • అమ్మాయిలను వేధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్
  • విడాకులకు దరఖాస్తు చేసిన శరవణ పాండియన్
  • నిర్మలాదేవి ఇంట్లో సీబీసీఐడీ సోదాలు

యూనివర్శిటీ పెద్దల లైంగిక అవసరాలు తీర్చాలంటూ చదువుకునే అమ్మాయిలను వేధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి కేసు తమిళనాడులో సంచలనం రేపగా, అటువంటి భార్య తనకు వద్దని ఆమె భర్త శరవణ పాండియన్ విడాకుల నోటీసులు పంపాడు. గతంలో ఓ మారు ఆమె వ్యవహారాలను భరించలేక, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన నిర్మల భర్త, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తన ఆలోచనను విరమించుకున్నాడు. ఇప్పుడు ఆమె తీవ్రమైన వివాదాల్లో కూరుకుపోవడం, అవసరమైతే, తన కుమార్తెలను కూడా అదే పనికి పురమాయిస్తాననే విధంగా మాట్లాడినట్టు ఆడియో రికార్డులు బయటకు రావడంతో విడాకులు కావాలని కోరుతూ ఆయన దరఖాస్తు చేసుకున్నారు.

ఇదిలావుండగా, నిర్మలాదేవి ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేసిన సీబీసీఐడీ అధికారులు, ఓ పెన్ డ్రైవ్, ల్యాప్ టాప్, కంప్యూటర్, సీడీలు, మూడు సంచుల నిండా వివిధ దస్త్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ ఇంటికి సీల్ వేశారు. ఈ డాక్యుమెంట్లలో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ డాక్యుమెంట్లలో పేర్లున్న అధికారులను సైతం విచారించాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

Tamilnadu
Nirmala Devi
Asst Professor
Saravana Pandian
Divorce
  • Loading...

More Telugu News