kanna laxmi narayana: 25న వైసీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ?

- బీజేపీలో తగిన ప్రాధాన్యత లేకపోవడంతో నిరాశ
- ఇప్పటికే, తన అనుచరులు, శ్రేయోభిలాషులతో చర్చించిన కన్నా
- పార్టీలో చేరే విషయమై త్వరలో ప్రకటన?
ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలోకి వెళ్లే తేదీ నిర్ణయమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 25న వైసీపీలో చేరతారని సమాచారం. ఇప్పటికే, తన అనుచరులు, శ్రేయోభిలాషులు, సన్నిహిత నేతలతో చర్చించిన కన్నా, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరనున్న విషయమై అతి త్వరలో ఓ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
కాగా, గుంటూరులోని నివాసంలో తన అనుచరులు, సన్నిహితులతో కన్నా నిన్న సమావేశమైన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేకపోవడం, ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కూడా తనకు దక్కదని దాదాపు తెలియడంతో కన్నా నిరాశకు గురయ్యారు.