Sangareddy District: ఏ పార్టీకి మద్దతివ్వాల్సిన అవసరం మాకు లేదు: తెలంగాణ మంత్రి హరీష్ రావు

  • కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన హరీష్ రావు
  • మద్దతు తెలపని పార్టీలను బీజేపీకి అనుకూల పార్టీలంటోంది
  • తెలంగాణ ప్రయోజనాల కోసం ‘కాంగ్రెస్’ ఎందుకు పోరాడదు? 

కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రైతుబంధ పథకం అమలుపై సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, తమకు మద్దతు తెలపని పార్టీలను బీజేపీకి అనుకూల పార్టీలుగా కాంగ్రెస్ చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రాజెక్ట్ లకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించిన ఆయన, ఈ రాష్ట్రంపై కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదంటూ దుయ్యబట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు రూ.750 కోట్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ ని ఆహ్వానిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News