ambedkar: అంబేద్కర్ బతికుండగా ఆయనను అనుక్షణం అవమానించారు: నెహ్రూ, గాంధీ కుటుంబంపై అమిత్ షా విమర్శలు

  • నెహ్రూ, గాంధీ కుటుంబం అంబేద్కర్ ను అవమానించేది
  • అదే సంప్రదాయాన్ని రాహుల్ కొనసాగిస్తున్నారు
  • కాంగ్రెస్ నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలి

రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ పదేపదే అవమానిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అంబేద్కర్ బతికున్నప్పుడు నెహ్రూ, గాంధీ కుటుంబం ఆయనను అనుక్షణం అవమానించిందని చెప్పారు. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు, సైన్యం తదితర సంస్థలను కూడా కాంగ్రెస్ విడిచిపెట్టడం లేదని... దీనికంతా కారణం రాజకీయ ప్రయోజనాలే అని చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ ఒక ప్రహసనమని అన్నారు. ఈ మేరకు అమిత్ షా వరుస ట్వీట్లతో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. 

ambedkar
nehru
gandhi
Rahul Gandhi
amit shah
  • Loading...

More Telugu News