gvl narasimha rao: క్రిస్టియన్ అని తెలిసి కూడా ఆమెకు పదవి ఇచ్చారు: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

  • టీటీడీ విషయంలో టీడీపీ దారుణంగా వ్యవహరిస్తోంది
  • అనితకు టీడీపీ బోర్డు సభ్యురాలి పదవి ఇవ్వడం దారుణం
  • కాంగ్రెస్ కు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదు

తెలుగుదేశం పార్టీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. టీటీడీ విషయంలో టీడీపీ దారుణంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే రీతిలో ప్రవర్తిస్తోందని అన్నారు. ఎమ్మెల్యే అనిత క్రిస్టియన్ అని తెలిసి కూడా ఆమెకు టీటీడీ బోర్డు సభ్యురాలి పదవి ఇచ్చారని దుయ్యబట్టారు.

ఆ తర్వాత అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో... చివరకు ఆ పదవికి ఆమె రాజీనామా చేశారని అన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ కు నమ్మకం లేదని... అందుకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై అభిశంసన తీర్మానాన్ని పెట్టారని అన్నారు. అయితే, దాన్ని తిరస్కరించడం ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించారని చెప్పారు.

gvl narasimha rao
anitha
Telugudesam
  • Loading...

More Telugu News