Chandrababu: చంద్రబాబు సీరియస్.. వచ్చి కలవాలంటూ అఖిలప్రియ, ఏవీలకు ఆదేశం

  • సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి
  • ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్తత
  • పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో చంద్రబాబు సీరియస్

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య పోరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడి చేసింది మంత్రి అఖిలప్రియ అనుచరులే అంటూ ఆయన కేసు కూడా పెట్టారు. దీంతో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ వచ్చి తనను కలవాలంటూ చంద్రబాబు ఆదేశించారు.

ఇటీవలే సింగపూర్ పర్యటన ముందు చంద్రబాబు వీళ్లిద్దరితో మాట్లాడారు. కలసి పని చేయాలని సూచించారు. ఇద్దరం కలసి సమన్వయంతో పని చేస్తామని ముఖ్యమంత్రికి చెప్పారు. అయినప్పటికీ, ఇద్దరి మధ్య మళ్లీ విభేదాలు రావడంపై సీఎం సీరియస్ అయ్యారు. మరోవైపు, అఖిలప్రియ మాట్లాడుతూ, ఎవరిపైనా దాడి చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు.

Chandrababu
akhilapriya
ab subba reddy
  • Loading...

More Telugu News