tcs: చరిత్ర సృష్టించిన టీసీఎస్... దేశంలోనే విలువైన కంపెనీగా అవతరణ

  • 100 బిలియన్ డాలర్ల కంపెనీగా గుర్తింపు
  • ఈ రోజు ఇంట్రాడేలో స్టాక్ పెరుగుదలతో నమోదైన రికార్డు
  • తర్వాతి స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు

ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చరిత్ర సృష్టించింది. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా మారింది. ఈ రోజు స్టాక్ మార్కెట్ ఇంట్రాడేలో టీసీఎస్ స్టాక్ 4 శాతం పెరగడంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) 100 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే రూ.6,80,912 కోట్లు. బీఎస్ఈలో ఈ ఉదయం టీసీఎస్ షేరు 4.39 శాతం పెరిగి 3,557కు చేరడంతో వేసిన అంచనా ఇది. ఈ రోజు మార్కెట్ ముగింపు సమయానికి మార్పులకు అవకాశాల్లేకపోలేదు.

టాటాలకు వందకు పైగా కంపెనీలు ఉండగా, గ్రూపు మొత్తం ఆదాయంలో 85 శాతం మేర టీసీఎస్ నుంచే వస్తోంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.32,075 కోట్లకు చేరింది. దీంతో ఈ షేరు ర్యాలీ చేస్తోంది. ఒక షేరుకు మరో షేరును కంపెనీ బోనస్ గా కూడా ప్రకటించిన విషయం విదితమే. మార్కెట్ విలువ పరంగా దేశంలో రెండో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కాగా, మూడో స్థానంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఉంది.

tcs
  • Error fetching data: Network response was not ok

More Telugu News