CricketER: 2019లో నా కెరీర్ పై కీలక నిర్ణయం... అప్పటి వరకు ఆడతా: క్రికెటర్ యువరాజ్ సింగ్

  • ప్రపంచ కప్ వరకు ఆడాలనుకుంటున్నా
  • రెండు దశాబ్దాలుగా దేశం కోసం ఆడుతున్నా
  • ఆ తర్వాత విరమణపై నిర్ణయం తీసుకుంటా

2019 ప్రపంచకప్ వరకూ తాను భారత జట్టు తరఫున ఆడాలనుకుంటున్నానని ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు. 2019 చివర్లోనే తన అంతర్జాతీయ కెరీర్ పై నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. యువరాజ్ సింగ్ చివరిగా 2017లో భారత జట్టు తరఫున వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. రెండు దశాబ్దాలుగా దేశం కోసం ఆడుతున్న తాను ఏదో ఒక రోజు విరామం తీసుకుంటానని పేర్కొన్నాడు.

‘‘2000 సంవత్సరం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా. ఎవరైనా సరే ఏదో ఒక రోజు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. 2019 తర్వాత నేను కూడా కచ్చితంగా నిర్ణయం తీసుకుంటా’’ అని చెప్పాడు. ఐపీఎల్ లో కింగ్స్ 11 పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్న యువరాజ్ తమ తక్షణ లక్ష్యం సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించడమేనని చెప్పాడు.

CricketER
yuvaraj singh
  • Loading...

More Telugu News