Mahesh Babu: ముఖ్యమంత్రి పాత్రకి మహేశ్ ను అనుకున్నది అందుకేనట!

  • ముఖ్యమంత్రి పాత్ర స్వభావం అది
  • ఆ లక్షణాలు మహేశ్ లో వున్నాయి
  • ఆయన కుదరదంటే ఈ సినిమా వుండేది కాదు  

మహేశ్ బాబు కథానాయకుడిగా 'భరత్ అనే నేను' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుని, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి కొరటాల శివ ప్రస్తావించారు. ఈ కథను మహేశ్ బాబుతోనే చేయాలనుకోవడానికి కారణమేమిటని చాలామంది అడిగారనీ, ఆయనైతేనే సరిగ్గా సరిపోతారని భావించడం జరిగిందని చెప్పారు.

 అనవసరంగా కోపం తెచ్చుకోని ముఖ్యమంత్రి పాత్ర ఇది. గొంతు పెంచి గట్టిగా మాట్లాడటం .. స్పీచ్ లు దంచేయడం ఈ పాత్రలో కనిపించవు. అవతలవారికి అర్థమయ్యేలా సూటిగా .. సున్నితంగా చెప్పే పాత్ర ఇది. ఈ లక్షణాలు మహేశ్ బాబులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందువల్లనే ఆయనను అనుకోవడం జరిగింది .. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్ కుదరదని చెప్పి వుంటే ఈ సినిమాయే లేదు" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News