Nazreen Khan Mukta: డ్రగ్స్ తరహా మాత్రలతో పట్టుబడిన బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్

  • నజ్రీన్ నుంచి మెటామెఫ్టామైన్ మాత్రల స్వాధీనం 
  • మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు నమోదు
  • నేరం రుజువైతే జీవిత ఖైదు

బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ నజ్రీన్ ఖాన్ ముక్తా 14 వేల మెటామెఫ్టామైన్ మాత్రలతో పట్టుబడడం సంచలనం రేపుతోంది. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న నజ్రీన్ మ్యాచ్ అనంతరం తిరిగి వెళ్తుండగా మాత్రలతో పట్టుబడింది. ఆమె ప్రయాణిస్తున్న బస్సును చిట్టగాంగ్ వద్ద తనిఖీ చేసిన పోలీసులు ఆమె నుంచి భారీస్థాయిలో ఈ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.

14 వేల మెటామెఫ్టామైన్‌ మాత్రలను ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక పోలీసు అధికారి ప్రణబ్ చౌదరి తెలిపారు. ఈ మాత్రలలో మాదకద్రవ్యమైన కెఫిన్ ఉంటుందని చెప్పిన ఆయన, నజ్రీన్ పై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసును నమోదు చేయనున్నట్టు తెలిపారు. నేరం కనుక రుజువైతే ఆమె జీవిత ఖైదును ఎదుర్కోక తప్పదు.

Nazreen Khan Mukta
Bangladesh
Cricket
  • Loading...

More Telugu News