Anam vivekananda reddy: టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం!

  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనం
  • సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స
  • ఇటీవల పరామర్శించిన చంద్రబాబు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని 'కిమ్స్‌’కు తరలించారు. ప్రస్తుతం ఇక్కడే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. చికిత్సకు ఆయన శరీరం స్పందించడం లేదని తెలుస్తోంది. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Anam vivekananda reddy
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News