Special Category Status: ప్రత్యేక హోదా రావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాల్సిందే: వైసీపీ ఎంపీ వరప్రసాద్

  • జగన్‌ దమ్మున్న నాయకుడు
  • రాష్ట్ర ప్రయోజనాలను సాధించగలరు
  • హోదా కోసం రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నాను

తాము రాజీనామా చేసినట్లే టీడీపీ ఎంపీలు కూడా చేస్తే  కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదని, రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునే వారమని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేత వరప్రసాద్‌ అన్నారు. ఈ రోజు కృష్ణా జిల్లాలోని అగిరిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష అనే పేరుతో దీక్ష చేయడమేంటని, చంద్రబాబు చేసిన మోసాలకు ఆ పేరుతో దీక్ష చేయాల్సింది ప్రజలని అన్నారు.

చంద్రబాబు ఇచ్చిన 600 హామీలను నిలబెట్టుకోవాలని ఏపీ ప్రజలు ధర్మపోరాట దీక్ష పేరుతో నిరసన తెలపాలని వరప్రసాద్‌ చురకలంటించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాల్సిందేనని, ఆయన లాంటి దమ్మున్న నాయకుడే రాష్ట్ర ప్రయోజనాలను సాధించగలరని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసినందుకు తాను గర్వపడుతున్నానని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చి సొంత నియోజకవర్గానికి వెళితే అక్కడి ప్రజలు సంఘీభావాన్ని తెలిపారని అన్నారు.

Special Category Status
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News