sri sakthi: నాకేమన్నా అయితే ‘మెగా’ ఫ్యామిలిదే బాధ్యత: నటి శ్రీరెడ్డి

  • మనసులో కక్ష ఉండి ఏం చేసినా వాళ్లదే బాధ్యత
  • ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం
  • నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి
  • మీ బెదిరింపులకు, వార్నింగ్ లకీ భయపడను

తనకు ఏమన్నా అయితే ‘మెగా’ ఫ్యామిలీదే బాధ్యత అంటూ నటి శ్రీరెడ్డి హెచ్చరించింది. ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో వరుస పోస్ట్ లు చేసింది. ‘మనసులో కక్ష ఉండి ఏం చేసినా వాళ్లదే బాధ్యత. ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం. నా కెరీర్ గురించి జీవితం గురించి భయపెడుతూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి' అని ఆరోపించింది.

కాగా, మరో పోస్ట్ లో.. ‘నేను అంతకుముందే చెప్పానుగా నాలుగు కుటుంబాల జులుం గురించి.. చూడండి నాగబాబు గారూ.. నా కన్నా పెద్ద వారు, సీనియర్ నటుడు అయిన మిమ్మల్ని నేను గౌరవిస్తా. కానీ, మీ బెదిరింపులకు, వార్నింగ్ లకీ భయపడే వాళ్లలో నేను లేను. ఫిల్మ్ ఇండస్ట్రీ ‘మెగా’ ఫ్యామిలీ సొత్తు కాదు..జులుం ప్రదర్శించకండి...’ అని చెప్పుకొచ్చింది.  

ఇంకో పోస్ట్ లో ‘కంపెనీ ఆర్టిస్టులకు నాగబాబుగారు చేసిన హెల్ప్ చాలా చిన్నది. చాలా విషయాలను వదిలేశారు. మాకు న్యాయం జరిగే వరకూ మా నిరసనను కొనసాగిస్తాం. ఫిల్మ్ ఇండస్ట్రీ అకృత్యాలను, జులుంని సహించం’ అని శ్రీరెడ్డి హెచ్చరించింది.





sri sakthi
naga babu
  • Error fetching data: Network response was not ok

More Telugu News