Ramcharan: బోయపాటి షూటింగులో జాయిన్ అయిన చరణ్!

  • బోయపాటి సినిమా షూటింగుకి చరణ్ 
  • ఇంట్లో పూజ చేసి షూటింగ్ కు వెళ్లిన చరణ్
  • ఫొటో పోస్ట్ చేసిన ఉపాసన

'రంగస్థలం' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న రామ్ చరణ్... తన 12వ చిత్రం షూటింగ్ కు బయల్దేరాడు. ఈ ఉదయం ఇంట్లో పూజ చేసి మరీ కొత్త సినిమా సెట్ కు చేరుకున్నాడు. చెర్రీ పూజ చేస్తున్న ఫొటోను ఆయన భార్య ఉపాసన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

'రామ్ చరణ్ 12వ సినిమాకు సర్వం సిద్ధమైంది. గుడ్ లక్ చరణ్' అంటూ ట్వీట్ చేశారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్ జంటగా కైరా అద్వాని నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇంతకు ముందే మొదలైనప్పటికీ, చరణ్ మాత్రం ఈ రోజు జాయిన్ అవుతున్నాడు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

Ramcharan
upasana
new film
Boyapati Sreenu
kaira adwani
  • Error fetching data: Network response was not ok

More Telugu News